నంద్యాల అర్బన్: నంద్యాల ఆటోనగర్ స్థలాల కేటాయింపులు అక్రమాలపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే భూమా
Nandyal Urban, Nandyal | May 11, 2026
నంద్యాల ఆటోనగర్ స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఆరోపించారు. సోమవారం జిల్లా ఎస్పీ సునీల్ షారాణ్ను కలిసి విచారణ కోరుతూ వినతిపత్రం అందజేశారు. నిబంధనలు ఉల్లంఘించి అర్హులను కాదని అనర్హులకు ప్లాట్లు కట్టబెట్టారని విమర్శించారు. ఈ కుంభకోణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.