జహీరాబాద్: మిర్జాపూర్ ఎన్ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మిర్జాపూర్ ఎన్ గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని పట్టుకున్నట్లు హద్నూర్ ఎస్సై సుజిత్ తెలిపారు. గ్రామానికి చెందిన తెలుగు అంజన్న అనే వ్యక్తి తన కిరాణా షాప్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడన్న నమ్మదగిన సమాచారంతో గురువారం సాయంత్రం దాడి నిర్వహించి 20 మద్యం బాటిలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మండలంలో ఎవరైనా అక్రమంగా మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.