నంద్యాల అర్బన్: ఇంధన ధరలు పెంపును నిరసిస్తూ నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
Nandyal Urban, Nandyal | May 18, 2026
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నూనెపల్లె ఫ్లెఓవర్ క్షేత్రంగా కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలకు విరుద్ధంగా ఇంధన ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.