చిన్నగూడూరు: గుండంరాజుపల్లిలో కమ్యూనిస్టు నేత గునిగంటి బుచ్చాలు మృతి చెందగా నివాళులర్పించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు గునిగంటి బుచ్చాలు ఇటీవల మృతి చెందగా, వారి కుమారులైన డోర్నకల్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గునిగంటి కమలాకర్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గునిగంటి రాజన్న, సిపిఎం జిల్లా నాయకులు జగన్, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మోహన్ మరియు వారి కుటుంబ సభ్యులను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పరామర్శించారు, ఈ సందర్బంగా గునిగంటి బుచ్చాలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.