బనగానపల్లె: అవుకు మండలంలో కరువు కోరలు
వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత, ప్రభుత్వ నిబంధనల కారణంగా ప్రస్తుతం నంద్యాల జిల్లాలో పంట సాగు ప్రశ్నార్థకంగా మారింది. అవుకు రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 4.75 టీఎంసీలు కాగా నేడు 0.4 టీఎంసీలతో 10 ఏళ్ల తర్వాత నీరు అడుగంటడంతో రైతులు, రైతు కూలీలు సందిగ్ధంలో పడ్డారు. గతంలో ఖరీఫ్ సీజన్లో పంట సాగుతో పచ్చదనం సంతరించుకునే అవుకు పంట భూములు నేడు కరవును తలపిస్తున్నాయి.