నంద్యాల అర్బన్: మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని మంత్రివర్గ వినతిపత్రం అందించిన రైతు సంఘాల నాయకులు
Nandyal Urban, Nandyal | Apr 4, 2026
నంద్యాలలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ను రైతు సంఘం నేతలు, రైతులు మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, క్వింటాల్కు ₹2400 మద్దతు ధర కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.