బనగానపల్లె నియోజకవర్గంలో నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై రామకృష్ణాపురం, పలుకూరు గ్రామాలకు చెందిన యువత, కార్మికులు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాలకు చేరేలా పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.