బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలోని నాపరాతి గనులలో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె నాపరాతి గనుల్లో విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన సుదర్శన్ రెడ్డి గని గుంతలో ఉన్న నీటిని మోటారు ద్వారా బయటికి తోడాలన్న ఉద్దేశంతో శనివారం రాత్రి పొద్దు పోయాక గనికి వెళ్లాడు. ఆదివారం ఉదయం వరకు రాకపోవడంతో వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.