కోడుమూరు: నూతన పల్లెలో మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని నూతనపల్లె గ్రామంలో లక్ష్మన్న (55) అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలిసి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదివారం ఉదయం గ్రామానికి చేరుకుని మృతదేహం పై పూలమాలవేసి నివాళులు అర్పించారు. మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అండగా ఉంటామని ధైర్యం అందించారు.