కోడుమూరు: బి తాండ్రపాడు, పెంచికలపాడు గ్రామాల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర లో భాగంగా ప్లాస్టిక్ వ్యతిరేకంగా ర్యాలీ
కోడుమూరు నియోజకవర్గం లోని బి తాండ్రపాడు గ్రామంలో శనివారం ప్లాస్టిక్ వ్యతిరేకంగా విద్యార్థులు, ఉద్యోగులు, నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని నినాదాలు చేశారు. పరిసరాల శుభ్రతకు పాటుపడతానని, పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. హరితాంధ్రప్రదేశ్ సాధనకు నడుం బిగిస్తానని నినదించారు. గూడూరు మండలంలోని పెంచికలపాడు గ్రామంలో ర్యాలీ అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.