నవాబ్‌పేట: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ 130 జయంతి కార్యక్రమాలు
వీరనారి చాకలి ఐలమ్మ 130 జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె ఆశయాలను కొద్దిగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ప్రధాన పాత్ర పోషించారని, తెలంగాణ పౌరుషాన్ని పోరాటాన్ని త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమస్ఫూర్తిని కలిగించిన గొప్ప పోరాట యోధురాలని గుర్తు చేశారు. అందరూ ఆమె అడుగుజాడల్లో నడవాలని తెలిపారు.