సంతనూతలపాడు మండలం మైనంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సంతనూతలపాడు ఎంపీడీవో సురేష్ బాబు, స్థానిక ఎస్సై అజయ్ బాబుతో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కొనసాగుతున్న విద్యా బోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం మెనూ ప్రకారం నాణ్యతగా విద్యార్థులకు అందించాలని ఎంపీడీవో నిర్వాహకులను ఆదేశించారు.