ఒంగోలు అర్బన్: ఒంగోలులో ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం
Ongole Urban, Prakasam | Apr 25, 2026
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ పి రాజాబాబు ఆదేశాల ప్రకారం మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది ప్రజలకు మలేరియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మలేరియా రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా మలేరియా అధికారి ఎన్ మధుసూదన రావుపేర్కొన్నారు .ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక వెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడారు