ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీస్ స్టేషన్లను స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుభ్రం చేసిన పోలీసులు సిబ్బంది
Ongole Urban, Prakasam | May 16, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో శనివారం సిఐలు ఎస్సై లతోపాటు పోలీసు సిబ్బంది పరిశుభ్రం చేశారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణాలను పరిశుభ్రం చేసి చెత్తాచెదాలను పోలీసు సిబ్బంది తొలగించి వాటిని కాల్చివేశారు. అలానే ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.