కోడుమూరు: కొత్తూరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న స్కూటర్, దంపతులకు గాయాలు
కోడుమూరు మండలంలోని కొత్తూరు గ్రామం వద్ద ఆదివారం రాత్రి ఆగి ఉన్న లారీని స్కూటర్ ఢీకొనడంతో దంపతులకు గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు ఆగి ఉన్న లారీని వెనకనుంచి వస్తున్న స్కూటర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల స్పందించి 108 వాహనానికి సమాచారం అందించారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.