కార్వేటినగరం మండలం దిగువ ఎర్రమరాజుపల్లెలో శ్మశానవాటికతో పాటు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని స్థానికులు ఆరోపించారు. శనివారం వారు మాట్లాడుతూ, గ్రామంలోని ప్రభుత్వ భూమిలో 60 సెంట్లు శ్మశానానికి కేటాయించగా, దానితో పాటు మరో 2 ఎకరాలను ఓ వ్యక్తి కబ్జా చేశారని, దీని మార్కెట్ విలువ 30 లక్షలు ఉంటుందని తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ కబ్జాలు జరిగాయని వారు ఆరోపించారు.