శ్రీకాళహస్తి: బైకులు ఢీకొని వ్యక్తి మృతి తొట్టంబేడు మండలం విరుపాక్షపురం ఎస్టీ కాలనీ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొడంతో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. శ్రీకాళహస్తి మండలం కమ్మ కొత్తూరు గ్రామానికి చెందిన నరేంద్ర విరూపాక్షపురంలో కూలీలకు నగదు ఇచ్చి తిరిగి వస్తుండగా ఎదురుగా మరో ద్విచక్ర వాహనం రావడంతో రెండు ఢీకొన్నాయి. నరేంద్రను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కి తరలిస్తుండగా మృత్యువాత పడ్డాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.