సంగారెడ్డి జిల్లా జన్నారం మండలం గడ్డపోతారంలోని లీ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న క్యాజువల్ కార్మికుడు ఆశి శ్రీనివాస్‌రావు (49) బుధవారం పని చేస్తున్న సమయంలో ఆకస్మికంగా కుప్పకూలాడు. సహోద్యోగులు వెంటనే అతన్ని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఆశి వేణు పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.