హిమాయత్ నగర్: బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోజంజాహీ పూల మార్కెట్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు
బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోజంజాహి పూల మార్కెట్లో ఎక్సైజ్ ఎఫ్టిఎఫ్ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం దాడి చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న సుశీల్ కుమార్ అనే వ్యక్తి మార్కెట్లో చిరు వ్యాపారం చేసేవాడు. అధిక డబ్బులు సంపాదించాలని డ్రగ్స్ విక్రయించడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు అతనిపై దాడి చేసి 27 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్సును స్వాధీనం చేసుకున్నారు. సుశీల కి డ్రగ్స్ ఇచ్చిన ప్రవీణ్ సింగ్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.