మేడ్చల్: కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు: లంచం తీసుకుంటుండగా ముగ్గురు అరెస్ట్
కీసర తహసీల్దార్ కార్యాలయంలో భూమి సక్సెషన్ కోసం 5 లక్షలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తొలి విడతగా 2.50 లక్షలు తీసుకుంటుండగా అధికారులు వీరిని పట్టుకున్నారు.