గుడిహత్నూరు: రైతులు ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వంతో మాట్లాడి జొన్నలు కొనుగోలు చేయించే బాధ్యత నాది : ఆదిలాబాద్ MLA
రైతులు ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వంతో మాట్లాడి జొన్నలు కొనుగోలు చేయించే బాధ్యత నాది అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు..శుక్రవారం జైనథ్ మండలంలోని మార్కెట్ యార్డ్ ను సందర్శించి ఎమ్మెల్యే.. రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు.. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆదివారం మార్కెట్ కి వచ్చి జొన్న పంటలు అమ్మడానికి వచ్చి ఐదు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి చాలా బాధాకరమన్నారు అని,ఈ విషయంలో జిల్లా అధికారులతో పాటు హైదరాబాద్ ఉన్నత స్థాయి అధికారులకు మాట్లాడడం జరిగిందన్నారు. అవసరమైతే రాత్రి సైతం కొనుగోలు చేపట్టాలన్నారు.