నంద్యాల అర్బన్: నంద్యాలలో వైయస్సార్ విగ్రహం తల ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
Nandyal Urban, Nandyal | May 31, 2026
నంద్యాలలోని శ్రీనివాస నగర్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు ఘటన స్థలానికి చేరుకొని నిరసన తెలిపారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.