హత్నూర: నర్సాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ దహనం చేయడానికి బిజెపి నాయకులు యత్నం, అడ్డుకున్న పోలీసులు
దేశానికి రక్షణగా ఉన్న సైనికులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం నర్సాపూర్ పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి ప్లెక్సీ దానం చేయడానికి బిజెపి నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు తోపులాట చోటు చేసుకుంది. సైనికులను అవమానపరుస్తూ మాట్లాడిన సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.