వరదయ్యపాలెం: కడూరు హరిజనవాడ వద్ద తృటిలో తప్పిన ప్రమాదం
వరదయ్యపాళెం మండలంలోని కడూరు హరిజనవాడ వద్ద ఓ లారి అదుపుతప్పి పక్కన ఉండే కాలువలోకి దూసుకెళ్లిన గురువారం జరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా లేదా వాహనాన్ని తప్పించబోయి పక్కకు వెళ్లాడా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.