డోన్: పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి :పాపిలిలో ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Apr 11, 2026 నంద్యాల జిల్లాప్యాపిలి టీడీపీ కార్యాలయంలో శనివారం మండల నాయకులు, కార్యకర్తలతో MLA కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో బలమైన కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు.