బనగానపల్లె: బనగానపల్లి నియోజకవర్గంలో పార్టీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలి: మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
వైసీపీ పాలనలో కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందించామని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం బనగానపల్లె పట్టణంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీని విజయపథంలో నడిపించేందుకు క్షేత్రస్థాయి నుంచి శ్రమించాలని విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు