పటాన్చెరు: రేపు గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో సేవా పక్షం కార్యక్రమం : బిజెపి గుమ్మడిదల మండల అధ్యక్షుడు ఐలేష్
గుమ్మడిదలలో సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు కావలి ఐలేష్ తెలిపారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ... రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. పీఎం నరేంద్ర మోడీ తోనే దేశ, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు.