డోన్: ప్యాపిలి మండలం లో గొర్రె పిల్లను కాపాడబోయి యువకుడు మృతి
Dhone, Nandyal | Jul 6, 2026 నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నల్లమేకలపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గొర్రెపిల్లలను కాపాడేందుకు కుంటలోకి దిగిన కురువ చిన్ననాగన్న (23) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఆదివారం గల్లంతైన అతని మృతదేహాన్ని సోమవారం పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలించి వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు