రెవెన్యూ సమస్యలపై వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలి : జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
Ongole Urban, Prakasam | Apr 8, 2026
రెవెన్యూ సమస్యలపై వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ముండ్లమూరు తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశమై పి జి ఆర్ ఎస్, రెవెన్యూ క్లినిక్ లలో రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పురోగతి, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, 22ఏ కేసులు, జీరో ఖాతాలు, రీ సర్వే, డిజిటలైజేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్ తదితర అంశాలపై అంశాల వారీగా సమీక్షించి దిశానిర్దేశం చేశారు.