డోన్: డోన్ లో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు,పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Apr 20, 2026 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లోనూ 'హ్యాపీ బర్త్ డే సీఎం సార్' అంటూ ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు.