ఆళ్లగడ్డ: కాలుష్య నిలయంగా పడగళ్ల సమీపంలోని వకుళ నది
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని పడగండ్ల గ్రామ సమీపంలోని వకుళ నది కాలుష్య కోరల్లో చిక్కుకుంది, వ్యర్థాపదార్థాలు, చెత్తాచెదారంతో నిండిపోవడంతో నీటిపారుదల నిలిచిపోయి రజకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అధికారుల నిర్లక్ష్యం వల్ల నది దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే వ్యర్థాలను తొలగించి నదిని శుభ్రం చేయాలని ఆ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు