బనగానపల్లె: పేరు సోములలో మూడు ఇళ్లలో చోరీ
సంజామల మండలం పేరుసోమలలో దొంగలు గత రాత్రి మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఓ ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలోని రెండు తులాల బంగారు, తాళిబొట్టు గొలుసు లాక్కెళ్లారు. మరో రెండు ఇళ్లలో మూడు తులాల బంగారు, 15 తులాల వెండి, రూ.3 వేల నగదు అపహరించారు. క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి, వేలిముద్రలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.