కర్నూలు: ప్రేమ పేరుతో మైనర్ బాలికపై వేధింపులు... ఆత్మహత్యాయత్నం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
ప్రేమ పేరుతో మైనర్ బాలికపై వేధింపులకు గురి చేశారని తల్లి. బీ దీప్తి ఆరోపించారు. కర్నూల్ లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... గార్గేయపురం కు చెందిన బోయ లోకేష్ మూడు సంవత్సరాలుగా మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి మోసం చేశారని, శాంతినగర్ కు తీసుకెళ్లాడు. లోకేష్ వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టు లాడుతుంది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. లోకేష్ పై చర్యలు తీసుకోవాలని తల్లి కోరింది.