డోన్: క్రీడల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన డోన్ కు చెందిన అన్నదమ్ములు
Dhone, Nandyal | Jun 4, 2026 నంద్యాల జిల్లా డోన్కు చెందిన ఎం.రామన్న, సునీత దంపతుల కుమారులు ఉదయ్కుమార్, శశాంక్ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. ఫెన్సింగ్, కరాటే, స్కేటింగ్, బోటింగ్లో శిక్షణ పొందారు. కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి కెనోయింగ్– కయాకింగ్ పోటీల్లో శశాంక్ రజతం, ఇద్దరూ కలిసి డ్రాగన్ బోట్ విభాగంలో రెండు రజత పతకాలు గెలిచారు. 2026 జనవరిలో భోపాల్లో జరిగిన జాతీయ స్థాయి బోటింగ్ పోటీల్లో ఇద్దరూ పాల్గొని సత్తా చాటారు.