ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు, చెడ్డి గ్యాంగ్ కదలికలపై నిఘా
Ongole Urban, Prakasam | May 24, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని పలు ప్రాంతాలలో పోలీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, కీలక సెంటర్లు, ఊరికి దూరంగా ఉండే నిర్మానుష ప్రదేశాలను పరిశీలించి ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. చెడ్డి గ్యాంగ్ కదలికలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంతేకాకుండా దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఎవరైనా అనుమానస్పదంగా అనిపిస్తే 112 లేదా 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.