డోన్: రౌడీ షీటర్లు వ్యక్తిగత కక్షలు వివాదాలకు దూరంగా ఉండాలి : బేతంచర్ల ఎస్సై రమేష్ బాబు
Dhone, Nandyal | Jun 14, 2026 రౌడీషీటర్లు వ్యక్తిగత కక్షలు, వివాదాలకు దూరంగా ఉండి శాంతియుత జీవనం గడపాలని ఎస్సై రమేశ్ బాబు సూచించారు. ఆదివారం బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చాచారు. ఎస్సై మాట్లాడుతూ.. గతంలో క్షణికావేశంలో జరిగిన తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. గ్రామాల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగిస్తూ అందరితో కలిసిమెలిసి జీవించాలని కోరారు