గుంతకల్లు: పట్టణంలోని పోర్టర్ లైన్ కాలనీలో విద్యుత్ షాక్ తో షేక్షావలి అనే వ్యక్తి మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని పోర్టర్ లైన్ కాలనీకి చెందిన షేక్షావలి అనే దినసరి కూలీ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పోర్టర్ లైన్ కాలనీకి చెందిన షేక్షావలి మంగళవారం తన తండ్రితో కలిసి ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడు. అయితే భవనంలో కింద పడి ఉన్న తీగను షేక్షావలి పక్కకు తొలగించాలని పట్టుకోగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.