నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో నడిరోడ్డుపై కాలిపోయిన బొలెరో వాహనం
Nandyal Urban, Nandyal | May 26, 2026
నంద్యాల జిల్లా గడివేముల మండలం గని గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు తన బొలెరో వాహనంలో వరిగడ్డి చుట్టల లోడును తరలిస్తుండగా సోమవారం ప్రమాదం జరిగింది. మార్గమధ్యంలో విద్యుత్ వైర్లు తగలడంతో గడ్డికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో బొలెరో దగ్ధమైంది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.