ఒంగోలు అర్బన్: ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వారి సమస్యలను సత్వరంగా పరిష్కరించాలి : జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Jun 1, 2026
ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వారి సమస్యలను సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల వ్రాతపూర్వక వినతులను జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. అందిన ఫిర్యాదులకు సంబంధించి ఫిర్యాదుదారుల వివరాలను ఆయా పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, తక్షణమే విచారణ చేపట్టాలన్నారు