నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో నల్లమల అడవిలో భారీ మంటలు
Nandyal Urban, Nandyal | Apr 8, 2026
నంద్యాల జిల్లా మహానంది సమీపంలో నల్లమల అడవిలో భారీగా మంటలు ఎగిసిపడుతూ అడవి తగలబడిపోతోంది. బుధవారం సాయంత్రం భారీ మంటలు కనిపించడంతో ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది వరకే రెండు సార్లు అడవిలో మంటలు చెలరేగాయని, అడవిలోని వన్యప్రాణులకు ప్రాణాపాయం పొంచి ఉన్నా ఫారెస్ట్ అధికారులకు పట్టదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వృక్ష సంపద అగ్నికి ఆహుతి అవుతుందన్నారు.