రాష్ట్రంలో త్రిబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడటం ఖాయం.. నిడదవోలులో మీడియాతో కందుల దుర్గేష్
నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్. గురువారం సాయంత్రం ఐదు గంటలకు పట్టణంలోని ఆనంధ్ ఇన్ హోటల్లో దుర్గేష్ మీడియా సమావేశం నిర్వహించారు. నిడదవోలుకు తనకి ఎప్పటినుంచో అనుబంధం ఉందన్నారు. నాకు వ్యాపారాలు లేవని, నేను పూర్తిగా రాజకీయ జీవితంలో ప్రజల మధ్యలోనే ఉంటాను అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ బోగవల్లి ప్రసాద్తో సహా పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.