ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజారావు ఆధ్వర్యంలో: రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ సిఐ నాగరాజరావు ఆధ్వర్యంలో ఆదివారం పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు, రౌడీ షీటర్లు తమ ప్రవర్తనను మార్చుకొని చట్టబద్ధంగా జీవనం సాగించాలని సూచించారు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రౌడీ షీటర్లలో నాగరాజారావు హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు