ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో అత్త అల్లుడితో అక్రమ సంబంధం.భార్యను చంపి వంకలో పూడ్చిన భర్త. కేసును ఛేదించిన పోలీసులు.
ధర్మవరం పట్టణం ఇందిరమ్మ కాలనీలో సరస్వతి అనే మహిళను భర్త వెంకటరాముడు రెండు నెలల క్రితం హత్య చేసి చెన్నేకొత్తపల్లి మండల సమీపంలోని గొల్లవాండ్లపల్లి వద్ద వంకలో పూడ్చి వేశాడు.ధర్మవరం టూ టౌన్ పోలీసులు నిన్న సాయంత్రం నిందితులను మేడాపురం క్రాస్ వద్ద అరెస్టు చేశారు.సొంత కూతురి భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని వారించిన వినకపోవడంతో హత్య చేసినట్లు వెంకటరాముడు ఒప్పుకున్నాడు. వెంకటరాముడకు బంధువులు ఇద్దరు సహకరించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితులను వంక వద్దకు తీసుకెళ్లి సరస్వతి శవాన్ని బయటకు తీసి పంచనామా చేసినట్టు తెలిపారు.