జహీరాబాద్: జహీరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా కార్తిక పౌర్ణమి మహోత్సవాలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. జహీరాబాద్ పట్టణంలోని కైలాసగిరి శివాలయం, సిద్దేశ్వరాలయం, జరా సంఘం కేతకి సంగమేశ్వర ఆలయం, బర్దిపూర్ దత్తగిరి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు మహిళలు ఆయా దేవాలయాల్లో దీపోత్సవ వేడుకల్లో పాల్గొని దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించారు. భక్తులకు ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను అందించారు.