నంద్యాల అర్బన్: నంద్యాలలో పోలీసుల ఆధ్వర్యంలో "ఫిట్ ఇండియా" సైకిల్ ర్యాలీ
Nandyal Urban, Nandyal | Jun 7, 2026
'ఫిట్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా SP సునీల్ షౌరాణ్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఎన్. యుగంధర్ బాబు నేతృత్వంలో డీపీవో నుంచి క్రాంతినగర్, రైతు నగర్ వరకు ర్యాలీ సాగింది. ఫిట్నెస్పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతిరోజూ వ్యాయామం, సైక్లింగ్ చేయాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, యువత పాల్గలొన్నారు.