కనిగిరి: ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయం: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి: ప్రజల ఆరోగ్య పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కాశీపురంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రభుత్వం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్య శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తారని, వాటిని వినియోగించుకొని ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.