ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లాలోని ఎస్సీ భూముల సమస్యలను పరిష్కరించాలని దళిత నేత నీలం నాగేంద్రం డిమాండ్
Ongole Urban, Prakasam | Jun 17, 2026
ప్రకాశం జిల్లాలోని ఎస్సీ భూముల సమస్యలను అధికారుల తక్షణమే పరిష్కరించాలని దళిత నేత నీలం నాగేంద్రం డిమాండ్ చేశారు. ఎస్సీ భూములను కొనుగోలు చేయకూడదని తెలిసి కూడా కొంతమంది కొనుగోలు చేస్తున్నారని అందుకు కొంతమంది దళితులకు సంబంధించిన కార్పొరేషన్ వారే సహకరించడం ఆవేదన కలిగిస్తుందన్నారు. అటువంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కందుకూరుకు చెందిన రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అధికారులు సమస్య పరిష్కరించాలని అన్నారు.