డోన్: బేతంచర్ల లో జన గణనపై శిక్షణ శిబిరం
Dhone, Nandyal | Apr 9, 2026 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణనను మండలంలో పగడ్బందీగా నిర్వహించాలని తహశీల్దార్ నాగమణి సూచించారు. గురువారంబేతంచెర్ల ఎంపీడీవో కార్యాలయంలో ఎనిమిరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షకులు నాగరాజు, మహేష్ 3 రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో గణన పక్కాగా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని వారు కోరారు.