ఒంగోలు అర్బన్: శ్రీ గౌతమ్ విద్యాసంస్థలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు.
Ongole Urban, Prakasam | May 6, 2026
ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు గాయత్రి మందిరం వద్ద నూతనంగా స్థాపించిన విజయవాడ వారి శ్రీ గౌతమ్ జూనియర్ కాలేజీ నాల్గవ బ్రాంచ్ ని మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విజయవాడ శ్రీ గౌతమ్ కాలేజీ అంటే మంచి పేరు ఉందన్నారు. ఇక్కడ ఉండే డైరెక్టర్ సురేష్ కూడా 30 సంవత్సరాల అనుభవం ఉందని, విజయవాడ శ్రీ గౌతమ్ పేరు, సురేష్ అనుభవం రెండు ఉండడం వల్ల అపుడే 200 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్నారని తెలిపారు. కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు.