గుంటూరు: గుంటూరులో ఏలూరు కు చెందిన బిటెక్ విద్యార్థిని నోటికి ప్లాస్టర్ వేసుకుని, ముక్కుకు క్లిప్పు పెట్టుకొని మృతి
Guntur, Guntur | Sep 22, 2025 గుంటూరు నగరంలోని నవీన లేడీస్ హాస్టల్లో సోమవారం ఉదయం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏలూరుకు చెందిన కావ్య మంగళగిరి వివిఐటిలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. గత రాత్రి గుంటూరులోని హాస్టల్ కి ప్లాస్టర్, క్లిప్పు ఆర్డర్ పెట్టుకుంది. అనంతరం నూటికి ప్లాస్టర్ వేసుకుని, ముక్కుకు క్లిప్పు పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం గమనించిన హాస్టల్ నిర్వాహకులు స్థానిక పట్టాభిపురం పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.